Thursday, August 5, 2010

మనమెంత పేదవాళ్ళమో!














ఒకరోజు, ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకుకి అసలు పేదరికం ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా బ్రతుకుతారో చూపించాలనే ఉద్దేశ్యంతో, ఒక చిన్న పల్లెటూరికి తీసుకెళతాడు. ప్రొద్దునంతా పొలాల వెంబడి, ఊరంతా కలియ తిరుగుతూ, రాత్రులు ఆరు బయట మంచంలో నిద్రిస్తూ ఒక నాలుగు రోజులు గడిపిన తర్వాత, తండ్రీ కొడుకులిద్దరు తిరిగి ఇంటికి పయనమవుతారు. 

వారి తిరుగు ప్రయాణములో తండ్రి కొడుకుని ఈ విధంగా అడుగుతాడు, "ప్రయాణం ఎలా అనిపించింది?". దానికి కొడుకు, "చాలా సరదాగా ఉంది నాన్న".
"పేదవాళ్ళు ఎలా జీవిస్తారో చూసావా?", తండ్రి అడుగుతాడు.
అప్పుడు కొడుకు అంటాడు, "ఆహ్ చూసాను"
"సరే, ఈ ప్రయాణంలో ఏమి నేర్చుకున్నావో చెప్పు మరి?", తండ్రి కొడుకుని అడుగగానే, కొడుకు తన తండ్రితో, "నేను చాలా చాలా విషయాలు గమనించాను. మనకు ఒక కుక్క ఉంటె, అక్కడ అందరికి నాలుగేసి కుక్కలున్నాయి. మనింట్లో ఈత కొలను మన గార్డెన్ మధ్య వరకు ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వాగులున్నాయి. మనకు విదేశాలనుండి తెప్పించిన లాంతర్లున్నాయి, కానీ వాళ్లకేమో ఆకాశంలో నక్షత్రాలున్నాయి. మన వరండా కొన్ని గజాలుంటే, వాళ్ళ వరండా ఎక్కడివరకుందో కూడా తెలియడం లేదు. మనం బ్రతకడానికి చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి, కానీ వాళ్ళ స్థలాలు  కనుచూపు మేరలో కూడా అంతమవ్వవు. మనకు సేవచేయడానికి పనివాళ్ళున్నారు, కానీ వాళ్ళు సేవచేయడానికే ఉన్నారు. మన భోజనం కొనుక్కొని తింటాము, కానీ వాళ్ళు పంట పండించుకొని తింటారు. మనల్ని మన చుట్టూ ఉన్న నాలుగు గోడలు  కాపాడతాయి , వాళ్ళని వాళ్ళ పొరుగువారు, స్నేహితులే కాపాడుతారు".
కొడుకు మాటలకి నిశ్చేజ్యితుడైన తండ్రితో కొడుకు చివరగా, "మనమెంత పేదవాళ్ళమో  చూపించినందుకు ధన్యవాదములు  నాన్న!"


Courtesy: http://www.inspirationalstories.com/16/1625.html

0 comments:

Post a Comment